News

ఎంపీ దివాక‌ర్ రెడ్డి క్షమాప‌ణ‌లు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ ఎంపీ దివాక‌ర్ రెడ్డి క్షమాప‌ణ‌లు చెప్పారు. గురువారం విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న తర్వాత ఆయ‌న‌పై విమాన సంస్థ‌లు నిషేధం విధించాయి. ఈ సంఘ‌ట‌న‌పై ఆయ‌న్ను మీడియా ప్ర‌శ్నించింది. ఆ ఘ‌ట‌న ప‌ట్ల మాట్లాడేందుకు నిరాక‌రించిన ఎంపీ దివాక‌ర్ రెడ్డి చేతులు జోడించి సారీ చెప్పారు. విమానాశ్ర‌యంలో జేసీ చేసిన వీరంగం ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించనున్న‌ట్లు పౌర‌విమానాయాన సంస్థ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు తెలిపారు. విస్తారా, గోవాఎయిర్‌, ఎయిర్ ఆసియా ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్‌, జెట్ ఎయిర్‌వేస్‌, ఇండిగో సంస్థ‌లు జేపీపై బ్యాన్ విధించాయి. ఘ‌ట‌న ప‌ట్ల పూర్తి విచార‌ణ చేప‌డుతామ‌ని కేంద్ర మంత్రి రాజు స్ప‌ష్టం చేశారు. విమానాశ్ర‌య పోలీసులు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పందించారు. అయితే ఘ‌ట‌న ప‌ట్ల ఇండిగో సంస్థ నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేద‌ని ఎయిర్‌పోర్ట్ సీఐ తెలిపారు. ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టామ‌ని, కానీ ఎవ‌రూ ఎటువంటి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేద‌న్నారు.